Friday, November 1, 2013

స్త్రీ , పురుషులు ఇద్దరూ అనుసరించి పాటించిననాడే పవిత్రమైన వివాహం పరమార్ధ స్థితిని చేరుకొంటుంది. భార్య భర్తకు , భర్త భార్యకు తోడునీడగా, అన్యోన్యం గా అరమరికలు లేకుండా అర్ధనారీశ్వర తత్వంతో జీవిస్తేనే ప్రమాణాలకు ఒక విలువ వుంటుంది.



* బ్రహ్మముడి *
ధృవం తే రాజా వరుణో ధృవం తే నో బృహస్పతి:
ధృవంత ఇంద్రశ్చాగ్ని రాష్ట్రం ధారయతాం ధృవం !!

దాంపత్య సామ్రాజ్యమున ధరించునట్టి మీకు రాజగు వరుణుడును, దేవుడగు బృహస్పతియు, ఇంద్రుడును, అగ్నియు నిశ్చలత్వము కలుగచేయుదురు. ( ముడిని కేంద్రముగా చేయుదురు గాక ). అని పై మంత్రము చదువుతూ బ్రాహ్మణుడు వధూవరుల కొంగులు ముడి వేస్తారు. బ్రాహ్మణుడు బ్రహ్మముడి వేసాక వధూవరులు ఇద్దరూ అగ్నిహోత్రము వద్దకు వచ్చి నమస్కరిస్తారు.

సప్తపదిలో ఏడు అడుగులు వేస్తూ " ఏకం ఇషే విష్ణుత్వాం అన్వేతు " అనే మంత్రం చదువుతారు. దాని అర్ధం:-
మొదటి అడుగు : శక్తి కోసం
రెండవ అడుగు : బలం కోసం
మూడవ అడుగు : వ్రతం కోసం
నాల్గవ అడుగు : ఆనందం కోసం
ఐదవ అడుగు : ఇంద్రియబలం కోసం
ఆరవ అడుగు : రుతువులకోసం
ఏడవ అడుగు : గృహ ధర్మాలకోసం

వధూవరులు ఇద్దరూ కలసి జీవితాంతం ఇలాగే కలసి నడుస్తామని అగ్ని సాక్షిగా ప్రమాణం చేస్తూ నడుస్తారు. సప్తపది కార్యక్రమం తోనే * వధువు ఇంటి పేరు మారిపోతుంది *. వివాహానికి సప్తపది కార్యక్రమమే చాలా ముఖ్యం.